Wednesday, November 20, 2024

అమ‌రావ‌తి రైతుల‌కు షాక్ – ఇళ్ల స్థ‌లాల‌ పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

అమరావతి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని పిటిషన్‌ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో ఒక వర్గానికి పరిమితం కాదని సీజే అన్నారు. ”రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే .పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం” అని సీజే పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement