తనపై విధించిన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని హైకోర్టు చెప్పిందని సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. దీనిపై చట్టప్రకారం మాత్రమే ముందుకెళ్లానని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఇంకా కలవలేదు. ప్రభుత్వ ఉత్తర్వులు సరిచేయాలని కోరేందుకే సీఎస్‌ను కలవాలని అనుకున్నా. నన్ను కలవడం ఆయనకు ఇష్టం లేదేమో.. నేనేం తప్పు చేశానో అధికారులు తేల్చాలి. నేనేమైనా తప్పులు చేస్తే బయటకు చెప్పాలి కదా. నా జీతం గురించి మాట్లాడేందుకు సీఎస్‌కు ఇబ్బంది ఏంటి? పోస్టింగ్ ఇవ్వలేదు.. జీతం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి?’’ అని ఏబీవీ ప్రశ్నించారు.
సస్పెన్షన్ చట్టవిరుద్ధమని హైకోర్టే చెప్పింది.. అయినా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు: ఏబీ వెంకటేశ్వరరావు
Advertisement
తాజా వార్తలు
Advertisement