అమరావతి : టెట్, టిఆర్టీ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండేలా షెడ్యూల్లో మార్పులు చేయాలని ఎపి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పరీక్షలపై తేదీలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. రాత పరీక్ష ముగిసిన తర్వాత ఇనిషియల్ కి పై అభ్యంతరాల స్వీకరించేందుకు మరింత సమయం ఇవ్వాలని కూడా తీర్పులో పేర్కొంది.
ఐదేళ్ల తర్వాత డీఎస్సీ ని హడావుడిగా నిర్వహించడంపై హైకోర్టు తప్పు పట్టింది. ఈ రెండు పరీక్ష ల మధ్య తగిన సమయం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2018లో జరిగిన టెట్, టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని, ఇప్పుడు మాత్రం హడావిడిగా నిర్వహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.