వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అతని బెయిల్ ను రద్దు చేస్తూ నేడు తీర్పునిచ్చింది. మేనెల 5వ తేదీలోపు సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పొందిన అనంతరం సీబీఐ ఆ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ పొందిన గంగిరెడ్డి కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని తన వాదనను హైకోర్టులో వినిపించింది. దీంతో హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్టు చేయొచ్చని కోర్టు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement