Tuesday, November 26, 2024

High Court – అవినాష్ బెయిల్ పై హైకోర్టులో వాడీవేడి వాద‌న‌లు..

హైద‌రాబాద్ – వివేకా హ‌త్య రాజ‌కీయ ప్రేరేపిత‌మంటూ సిబిఐ హైకోర్టులో త‌న వాద‌న‌ల‌ను వినిపించింది. అవినాష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పై శ‌నివారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు హైకోర్టులో వాద‌ల‌ను ప్రారంభ‌మ‌య్యాయి..సిబిఐ త‌ర‌పు న్యాయ‌వాదుల త‌మ వాద‌న వినిపిస్తూ , రాజ‌కీయంగా అడ్డువ‌స్తున్న‌రనే వివేకాను హ‌త్య చేశార‌ని పేర్కొన్నారు.. ఇందుకు అవినాష్ రెడ్డి నుంచి స‌హ నిందితుల‌కు పెద్ద మొత్తంలో నిధులు చేరాయ‌న్నారు.. వాటిలో రూ.46 ల‌క్ష‌ల‌ను తాము స్వాధీనం చేసుకున్నామ‌ని హైకోర్టు దృష్టికి తెచ్చారు.. సిబిఐ తరపున లాయర్లు హై కోర్ట్ లో జడ్జి కు తమకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని వివరించడం జరిగింది. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు అనుమానం ఉన్న చాలా మందిని విచారించామని.. కానీ అందరూ మాకు సరిగా విచారణ చేయడానికి సహకరించార‌న్నారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామ‌ని అన్నారు. ఈ కేసులో దర్యాప్తు కోసం అవినాష్ రెడ్డికి ఇప్పటికి చాలా సార్లు నోటీసులు పంపించామని.. కానీ ఎప్పటికప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరు అవుతున్నారంటూ చెప్పుకున్నారు. ఈ కేసులో విచారణను అడ్డుకోవడానికి మొదటి నుండి ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ చెప్పారు. ఇక ముందస్తు బెయిల్ కోసం అని కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ పిటిషన్ లు వేస్తున్నారంటూ సిబిఐ తరపున లాయర్ కోర్టుకు విన్న‌వించారు.. అవినాష్ రెడ్డికి వివేకా హత్యలో ప్రమేయం లేనప్పుడు విచారణకు సహకరించడం లేదని వాదించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement