Thursday, November 21, 2024

Breaking: ఏపీ పీఆర్సీ జీవోల‌పై హైకోర్టు ఆగ్ర‌హం

పీఆర్సీ జీవోల‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచార‌ణ జ‌రిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన పీఆర్సీ జీవోల ద్వారా సర్వీసు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తున్నారని, జీతాల నుంచి రికవరీ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ ఏపీ గజిటెడ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య గత నెలలో హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశిస్తూ.. కేసు విచారణ వాయిదా వేసింది. ఈరోజు జ‌రిగిన‌ హైకోర్టు విచారణలో ఉద్యోగం కోసం జీవితాలను ధారపోసిన ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చ‌రించింది. ఈ రికవరీలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement