విశాఖ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమ శిబిరాన్ని సినీ హీరో శివాజీ సందర్శించారు. ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి శివాజీ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్కు పోరాటంలో ‘‘ఎవరినీ నమ్మకండి. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత. ప్రజాప్రతినిధుల కంటే ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ బెటర్. బీజేపీ దుర్మార్గంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తోంది. కాంగ్రెస్‌ను కామెడీగా చూపించి అవినీతి ముద్ర వేశారు’’ శివాజీ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్టీల్‌ప్లాంటును 100 శాతం ప్రైవేటీకరిస్తామని ప్రకటించడంతో విశాఖలో కార్మిక, నిర్వాసిత సంఘాలు భగ్గుమన్నాయి. ఉక్కు నగరంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. నిరసనలు మిన్నంటాయి. కార్మికులు, నిర్వాసితులు కన్నెర్ర చేస్తున్నారు. రహదారులు దిగ్బంధం చేస్తున్నారు. అధికారులను అడ్డుకున్నారు. పాలకుల చిత్రపటాలను కాలితో తొక్కి తుక్కు తుక్కు చేస్తున్నారు. మంటల్లో వేసి కాల్చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్…‘డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే…ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి.
“కేఏ పాల్” బెటర్: శివాజీ
Advertisement
తాజా వార్తలు
Advertisement