Sunday, January 19, 2025

Traffic | విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ !

  • తిరుగు ప్రయాణంలోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు

ఏపీ, తెలంగాణల్లో సంక్రాంతి సెలవులు ముగిశాయి. సంక్రాంతి పండుగకు సొంతూళ్ల‌కు వెళ్లిన వారు ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నెలకొంది. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. వాహనాలు భారీగా క్యూ క‌డుతుండ‌టంతో.. దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

అటు విజయవాడ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు APSRTC అదనపు బస్సులను నడుపుతోంది. విజయవాడ నుంచి ఆర్టీసీ 133 అదనపు బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ అదనపు బస్సుల్లో ముందస్తు బుకింగ్ సౌకర్యం ఉండదని ఆర్టీసీ స్పష్టం చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement