Sunday, September 8, 2024

Monsoon | జోరందుకున్న వర్షాలు.. కోస్తాంధ్ర, రాయలసీమలో వానలు

అమరావతి, ఆంధ్రప్రభ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటున్నాయి. మంగళవారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. రాత్రి 8 గంటల వరకు గుంటూరు జిల్లా అత్తోటలో 67.5 మిమీ, అనకాపల్లి జిల్లా రావికమతంలో 59 మిమీ, అల్లూరి జిల్లా పాడేరు లో 55 మిమీ, అనకాపల్లి జిల్లా పెదపూడిలో 53మి.మీ, గుంటూరు తాడేపల్లిలో 52 మి.మీ, శ్రీకాకుళం పాతపట్నంలో 50 మి.మీ, చిత్తూరు జిల్లా సోమలలో 45 మి.మీ వర్షపాతం నమోదయింది.

పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో వర్షాలు కురిశాయి. 30 నుంచి 40 కిమీ మేర బలమైన గాలులు వీచాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు మన్యం,అనకాపల్లి, అల్లూరి,కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణసంస్థ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement