Tuesday, November 19, 2024

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురవున్నాయని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని తెలిపారు.

మరోవైపు ఏపీలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో​ అధికారులు అప్రమత్తం అయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ను టచ్ చేస్తే మాడిపోతావ్: బండి సంజయ్ కి మోత్కుపల్లి వార్నింగ్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement