బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం శుక్రవారం వేకువజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, పుదుచ్చేరి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..