Saturday, November 23, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో అతి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే కోనసీమలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement