గత రెండురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇసుక సరఫరాలో అంతరాయం నెలకొందని గనులు, అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిపివేసామని, వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత అన్ని రీచ్ ల నుండి ఇసుక సరఫరా కొనసాగుతుందన్నారు.
వినియోగదారులు ఈ నేపధ్యంలో తమవంతు సహకారం అందించాలని సూచించారు. అదివారం నాటికి 39 ఇసుక నిల్వ కేంద్రాలలో 15,19,239 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. శనివారం 18,031 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,412 ధరఖాస్తులు అందాయన్నారు. వీరిలో 1,115 ధరఖాస్తుదారులకు 15,636 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామన్నారు.