Tuesday, September 17, 2024

AP | విశాఖలో భారీ వర్షాలు… సైక్లోన్‌ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక‌ విశాఖలోనూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు

జిల్లాలోని పలు పోలీసు, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని, ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఇక‌ ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కలెక్టర్లు రేపు (సోమవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891-2590102, 0891-2590100
విశాఖ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 0891- 2565454
డయల్‌ 100, 112
పెదగంట్యాడ తహసీల్దార్‌ 9948821997
గాజువాక 8886471113
ఆనందపురం 9700501860
భీమిలి- 9703888838
పద్మనాభం – 7569340226
చినగదిలి – 9703124082,
పెందుర్తి – 7702577311
సీతమ్మధార -9182807140
గోపాలపట్నం తహసీల్దార్ 7842717183
ములగాడ -944055200

Advertisement

తాజా వార్తలు

Advertisement