Sunday, December 1, 2024

Heavy Rains – తిరుపతి , నెల్లూరు జిల్లాలో కుమ్మేస్తున్న వర్షాలు

నెల్లూరు – ఫెంగల్‌ తుఫాన్ మహాబలిపురం వద్ద గత అర్ధరాత్రి తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో తడ దగ్గర జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాన నీరు నిలిచింది. జిల్లాలోని సూళ్లూరుపేట తడ, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, ఏర్పేడు, నారాయణవనం, కేవీబీపురం మండలాల పరిధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

తుఫాన్ ప్రభావంతో.. గూడూరు, కోట, వాకాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement