ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే అవకాశముందని భారత వాతారవణ శాఖ హెచ్చరించింది. ఈనెల 22 వరకు ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.. వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏపీ తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గాలుల వేగం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఈరోజు, రేపు సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.