ఆంధ్రప్రదేశ్‌ని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ప్రవాహం కొనసాగుగంది. వాగుల వంకలు పొంగపొర్లుతున్నాయి. దీంతో రహదారులు నీట మునిగి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పలు గ్రామాలు నీటి ముంపులో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చాకలిపాలెంలో కాజ్వే నీటమునిగింది. బిడియం కాజ్‌వేపై నీరు చేరడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి నది ఉధృతితో ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పలు గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పలు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. గ్రామాలను గోదావరి నది ముంచెత్తింది. అదేవిధంగా ఎద్దువాగు ఉధృతితో మరో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండేటి వాగు కూడా ఉరకలు పరుగులు పెడుతోంది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.