ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని ఉయదగిరి, కావలి, గూడూరు నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షం పడుతున్నాయి.
అయితే ఆ రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈనెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నవంబర్ 18 నుంచి వర్షాలు కురువనున్నాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.