ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైయస్‌ఆర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
అలాగే రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, వైయస్‌ఆర్, నంద్యాల, ఎల్లుండి పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.