గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖపట్నంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాంధ్ర, రాజమండ్రి, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement