Thursday, November 21, 2024

రాయలసీమ, కోస్తాంద్రలో.. రెండ్రోజుల పాటు భారీ వ‌ర్షాలు

ఏపీలోని రాయలసీమ, కోస్తాంద్రలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. బంగ్లాదేశ్‌పై ఉన్న ఉపరితల ద్రోణి వాయవ్య దిశగా పయనించి దక్షిణ జార్ఖండ్‌లో కేంద్రీకృతమైనందున ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశముంద‌ని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ఇదే ప్రాంతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడుతుందని, పశ్చిమ కోస్తాలో తీర ద్రోణి విస్తరణ కారణంగా అరేబియా సముద్రం నుంచి బలమైన గాలులు మధ్య భారతదేశం మీదుగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తాయ‌ని, అలాగే రాగల 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement