Saturday, November 2, 2024

AP Rains | బలపడిన అల్పపీడనం… మ‌రో మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర దిశగా పయనించి సోమవారం నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మీదుగా తుపానుగా మారుతుందని తెలిపింది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లను దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాంధ్రలో… ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement