Saturday, November 23, 2024

Rains | ముంచుకొస్తున్న‌ మరో అల్పపీడనం… మూడు రోజులపాటు భారీ వర్షాలు !

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో మంగళశారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచి 24 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 25.4, సదాశివ్‌నగర్‌లో 24, నిజామాబాద్‌ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీ-మీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement