తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.
కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 87,062 క్యూసెక్కుల నీరు ఎగువ భాగాన నుంచి వస్తుండగా 216 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్ల 1,623.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా పల్నాడు జిల్లా పులిచింత ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. ప్రసుత్తం ప్రాజెక్టుకు 3,320 క్యూసెక్కుల నీరు వస్తుండగా 400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి నదిలో క్రమంగా వరద ప్రవహం పెరుగుతుంది. దవళేశ్వర బ్యారేజీ వద్ద 9.7 అడుగుల నీటిమట్టంతో వరద నీరు ప్రవహిస్తుంది.