Saturday, November 23, 2024

ఎగువన భారీ వర్షాలు.. శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వ‌ర్షాల‌తో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 812 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో 215 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 35.8326 టీఎంసీల నీరు ఉన్నది. కర్నాటకలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర నదికి వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 10763 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆర్డీఎస్‌ ప్రధాన కాలువకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement