తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : తిరుపతి నగరంలో కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో తిరుపతి నగరంలో దాదాపు వందల సంఖ్యలో అపార్ట్ మెంట్ లకు నీళ్లు రావడం జరిగింది. దానికి తోడు అనేక కాలనీల్లో నీళ్లు ప్రవాహం ఎక్కువై ఇళ్లలోకి నీరు రావడంతో జనం ఆందోళన చెంది శుక్రవారం ఉదయం నుంచి నగరంలో అన్నారావు సర్కిల్, సంజీవ్ గాంధీ కాలనీ, ఎంఆర్ పల్లి, జీవకోన, మధురానగర్, ఇలా పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లలో ఇళ్లల్లోకి నీరు రావడంతో సెప్టిక్ ట్యాంకు ద్వారా నీటిని బయటకు తీసేందుకు ఆయా కుటుంబాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
నగర కార్పొరేషన్ కు సంబంధించి సెప్టిక్ వాహనాలు మూడు మాత్రమే ఉన్నాయి. ఇందులో ముగ్గురు విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో ప్రైవేట్ సెప్టిక్ ట్యాంక్ లకు బాగా డిమాండ్ పెరిగింది. అపార్ట్ మెంట్ వాసులు కంటతడి పెడుతున్నారు. విలువైన వాహనాలు వర్షానికి ఆగిపోయాయి. వాటిని బయటకు తీసుకురావడం చాలా కష్టతరంగా ఉందని దాదాపు రెండు అడుగులు నీళ్లు ప్రవాహం ఎక్కువగా ఉందని వారు వాపోతున్నారు. ఇలా తిరుపతి నగరంలో కురిసిన వర్షానికి నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.