Friday, September 13, 2024

Heavy Rain – శ్రీశైలంలో వాన బీభత్సం…

లోతట్టు కాలనీలు జలమయం… ప్రజల అవస్థలు వర్ణనాతీతం..

నంద్యాల బ్యూరో ఆగస్టు 21 ప్రభ న్యూస్ …. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో అర్ధరాత్రి కురిసిన ఉరుములు మెరుపుల వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమేమయ్యాయి. శ్రీశైలం ప్రాంతంలోని పాతాళ గంగ కి వెళ్లే మెట్ల దారి కూడా వర్షం నీటితో నిండుకు పోయింది. లలితాంబ దుకాణంలో కూడా నీరు వచ్చింది. శిక్షణలోని కొత్తపేట శ్రీనగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. నల్లమల్ల ఫారెస్ట్ అనుకొని ఉన్న కాలనీలో వర్షపు నీరు అధికంగా రావటంతో కాలనీలు జనమయమయ్యా యి.

రాయలసీమ ప్రాంతానికి అధిక వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారుల అ ప్రమతమయ్యా రు. కాలనీలన్నీ జలమయం కావటంతో ఆలయ అధికారులు రెవెన్యూ అధికారులు భోజన ఏర్పాటు చేస్తున్నారు.అధికారు లు కాలనీలు పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

విరిగిపడిన కొండ చరియలు…

శ్రీశైలం డ్యాం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. గడచిన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది.ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పెట్టడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైపోయింది. దీంతో డ్యాం దిగుబండ రహదారిలో ఉన్న కొండ చరియాలు విరిగిపడ్డాయి. ఆ సమయానికి ఎలాంటి వాహనాలు రాకపోక లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్ద పెద్ద బండ రాళ్లు రోడ్డుకు మీద పట్టడంతో ఆ సమయంలో ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పంది..

దేవస్థానం అధికారులు పోలీసులు స్పందించి రోడ్డుపై పడ్డ రాళ్ళను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.. అధికారులు అప్రమత్తమయ్యారు. నష్టపోయిన బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement