నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుండి మేఘాలు కమ్ముకుని మబ్బులతో చిరుజల్లులు పడుతూ మధ్యాహ్నానికి భారీ వర్షం కురిసింది. అయితే వర్షంలోను తడుస్తూ భక్తులు మల్లన్న దర్శనానికి చేరుకున్నారు. నిన్నటి వరకు ఎండలు, ఉక్కపోత ఉన్నపటికీ ఇవ్వాల ఉదయం నుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఆహ్లాద వాతావరణం నెలకొంది. కాగా, శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలలో భారీ వర్షం కురవడంతో పలు చోట్ల ఘాట్ రోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్లన్న దర్శనానికి వచ్చే వారు జాగ్రత్తగా రావాలని ఆలయ అధికారులు కోరారు.
- Advertisement -