బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుడంతో జనజీవనానికి అవస్థలు తప్పడంలేదు. వాతావరణ శాఖ ఇప్పటికే చిత్తూరు జిల్లాలను రెడ్ అలెర్ట్ కింద హెచ్చరించింది. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిచ్చాటూరు మండలం పలు గ్రామాలు జలమయ్యాయి. వర్షాలకు ఎస్.ఎస్.బి పేట, హనుమంత పురంలో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఆప్రాంతం చెరువును తలపిస్తోంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు.
రైతులకు ఈవర్షాలు వల్లకొంత మేలు జరుగుతోందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు వర్షాల నేపధ్యంలో ప్రత్యేక హెచ్చరికలు ప్రకటించారు. వర్షాల నేపధ్యంలో భారీ ఉరుములు కూడా ఉంటుందని, ఎక్కడబడితే అక్కడ ప్రజలు ఉండకూడదని సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అదే విధంగా పశువులు, గేదేలను అటవీప్రాంతాలకు మేపుకోసం తీసుకెళ్ళడం మంచిది కాదని తెలిపారు.
మరోవైపు వాతావరణంలో మార్పులు, భారీ వర్షాలు నేపధ్యంలో ఆరోగ్య విషయాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు డాక్టర్ గాయత్రి సూచించారు. వైరల్ ఫీవర్ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!