ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.