కర్నూలు, ప్రభన్యూస్ బ్యూరో: కర్నూలు జిల్లా లోని పల్లెల నుంచి పేదలు పొట్ట చేతబట్టు-కొని వలసపోతున్నారు. వీరిలో కూలీలతోపాటు- సన్న, చిన్నకారు రైతులు కూడా ఉన్నారు. గత వ్యవసాయ సీజన్‌లో వర్షాలు అధికమై అనేకచోట్ల పంటనష్టంతో చిన్న, పేద రైతులు ఎందరో అప్పులపాలయ్యారు. సొంత భూమి లేక కొందరు.. కొద్దిగా ఉన్నా కౌలుకు తీసుకున్నవారు మరికొందరు.. సాగు చేసిన పేద రైతులకు అప్పులు మరింత ఎక్కువయ్యాయి. పొలా లు సాగు చేస్తున్నది కొద్దిమేరే ఫలితం ఉంటుంది. అందరికీ పనులు దొరకడంలేదు. దీంతో అనేకమంది పేదలు, కౌలు రైతులు నగరాలకు, పట్టణాలకు, వ్యవసాయ పనులు ఉన్నచోట్లకు వలస పోతున్నారు., వలస వెళ్తున్న వారిలో కొంతమంది తమ పిల్లలను కూడా వెంట తీసుకెళ్తుండగా, మరికొందరు తమ పిల్లలను బంధువుల వద్ద ఉంచి వెళ్తున్నారు. బయటి రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్తే… కనీసం తాము కాస్త తిని ఇంటికి ఎంతో కొంత పంపించవచ్చనే ఆశ. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ముసలివాళ్లకు పిల్లల్ని అప్పజెప్పి… పొట్ట చేతబట్టు-కుని ఉపాధి వేటలో పడుతున్నట్లు- కర్నూలు జిల్లా వలసదారులు ఆవేదనతో చెబుతున్న మాట. ఒకటి కాదు రెండు కాదు… కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని వందల కుటు-ంబాలది ఇదే దీనస్థితి. ముఖ్యంగా జిల్లాలోని ఆదోని, కోసిగి, హోళగుంద, ఎమ్మిగనూరు మం డలాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. గత 20 రోజు ల్లో దాదాపు 30వేల మంది వలసపోయారు. కోసిగి మండ లం దుద్ది నుంచి వందమంది హైదరాబాద్ పరిసర ప్రాంతా లకు, కోసిగి నుంచి సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు పత్తి విడిపించే పనుల కోసం వెళ్లారు. గ్రామంలో వ్యవసాయ పనులు లేకపోవడం, ఉపాధి పనులు అంతంతే ఉండటం, ఉన్న పనులు సక్రమంగా దొరక్కపోవడం, ఉపాధి కూలి గిట్టు-బాటు- కాకపోవడం, సకాలంలో కూలి డబ్బులు అందక పోవడంతో వలస వెళ్లక తప్పడం లేదని కూలీలు చెప్తున్నారు.
ఆ ప్రాంతాల నుంచే అధికం
కోసిగి పరిధిలోని దుద్ది పంచాయతీలో ఇప్పటికే 5వేల మందికిపైగా వలస వెళ్లడం గమనార్హం. ఇక్కడ అధిక భాగం పల్లెపాడు, చింతకుంట, కోసిగి, జంపాపురం, దుద్ది, అగస నూరు, సాతనూరు, బెళగల్, కోలమాన్‌పేట గ్రామాలతో పాటు- పెదకడబూరు మండలంలోని కల్లుకుంట, దనిగట్టు-, చిన్నకడబూరు, కంబళదిన్నె, జాలవాడి, మురుకాని, దొడ్డిమేకల, బసలదొడ్డి, ఉలికనిమి, నౌలేకల్లు నుంచి వలస వెళ్లిన వారిలో ఉన్నారు. ఇక హోళగుంద మండల పరిధిలో పరిస్ధితి ఇలాగే ఉంది. ఇప్పటికే ఈ మండలం నుంచి 850 మందికిపైగా వలస బాట పట్టారు. ఒక్క హోళగుంద నుంచే 350 మంది బెంగళూరు సిమెంట్ పనికి, గుంటూరు మిర్చి పనికి, ఇక గజ్జహళ్లి నుంచి 150 మంది హైదరాబాద్ పరిసరాల్లో పత్తి విడిపించేందుకు, గుంటూరు మిర్చి పనులకు వలస వెళ్లారు. ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం నుంచి 500 మంది తెలంగాణ రాష్ట్రం శాంతినగర్‌లో పత్తి విడిపించేందుకు వెళ్లారు. కలగట్ల నుంచి 500 మంది ముంబయిలో చిన్న చిన్న వ్యాపారాలకు, గుంటూరులో మిర్చి పనులకు వెళ్లారు. బోడిబండ, బనవాసి, కడివెళ్ల, సొగనూరు, పార్లపల్లి, పెసలదిన్నె నుంచి దాదాపు 1,400 వలస వెళ్లారు. తిమ్మాపురం నుంచి వంద మంది రైతులు వలస వెళ్లారు. కడివెళ్ల, సొగనూరు, పార్లపల్లి, పెసలదిన్నె గ్రామాల్లో వర్షాధార సాగు వల్ల పంటలు సరిగ్గా పండలేదు. దీంతో, ఆ గ్రామాల నుంచి దాదాపు 500 మంది రైతులు వలసపోయారు. వలస వెళ్లిన వారిలో అధిక భాగం ఒకటి, రెండు ఎకరాలు ఉన్న వారే.
వలసల జిల్లాకే..
సాగు భూములు లేని వందలాది రైతు కూలీలు కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని పాలమూరు, హైదరబాద్‌కు చేరుకుంటున్న వారిలో అధికంగా ఉన్నారు. ఇక్కడ సాగు చేసిన పత్తి పంటలల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం నేల కోస్గిలో వాల్మీకి బోయలు అధికంగా ఉన్నారు. వీరికి ఎలాంటి కుల వృత్తి లేదు. దీంతో అధిక భాగం పంట పోలాల్లో కూలీలుగా పనిచేసి పొట్టపోసుకుంటారు. వీరికి ఎలాంటి స్థిర, చర ఆస్తులు లేవు. ఏటా ఖరీఫ్, రబీ సమయంలో వివిధ ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వ్యవసాయ పనులు లేకుంటే బెంగళూరు వెళ్లి సిమెంటు- ఫ్యాక్టరీలో పనిచేస్తారు. వీరు వలసల జీవులుగా జీవిస్తుండడం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. తమ పిల్లలను వెంట తీసుకొని ఎక్కడ ఉపాధి లభిస్తే అక్కడ వెళ్తూంటారు. వర్షాకాలంలో నాలుగు నెలలు తప్ప మిగతా ఎనిమిది నెలలు సొంత ఊరికి దూరంగానే వీరు కాలం వెల్లదీస్తారు. ఇలా వలసలు వెళ్లేందుకు ప్రధాన కారణం తమ జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటు-వంటి చర్యలు తీసుకోక పోవడం వల్లే వలస వెళ్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దేశమంతా ఉపాధి హామీ పనులు జరుగుతుంటే కర్నూలు జిల్లాలో మాత్రం పనులు చేయకుండా నిధులు దారి మళ్ళిస్తున్నట్లుగా రాజకీయ పార్టీల ఆరోఫణలున్నాయి దీంతో ఒకే ఇంట్లో రెండు, మూడు కుటు-ంబాలు వలస వెళ్తున్న వారిలో ఉంటు-న్నారు. సొంత ఇంటికి కనీసం జాగా కూడా ఇవ్వడం లేదంటు-న్నారు. పిల్లలు నాలుగు మెతుకులు తినాలంటే వలసలు పోవాల్సిందేనని కోస్గి మండలం నేల కోస్గి గ్రామానికి చెందిన భీమన్న, లక్ష్మి రేణుకమ్మ, వీరారెడ్డి రామాంజనేయులు వాపుతున్నారు.
ఉన్న ఊర్లో పని లేదు
ఉన్న ఊర్లో పని దొరకడం లేదు… ఉపాధి పని చేసినా డబ్బులు సక్రమంగా రావడం లేదు…. మహబూబ్‌నగర్ జిల్లా శాంతినగర్‌కు కుటు-ంబంతో సహా వలస వెళ్లాను. పత్తి విడిపించే పని చేసుకుంటు-న్నాను. రోజుకు రూ.300 ఆదాయం వస్తోందంటున్నారు. కోసిగికి చెందిన వీరాంజనేయులు నాయుడు
కుటు-ంబపోషణ కరువై..
రెండెకరాల్లో పత్తి పంట సాగు చేశాను. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. అనుకున్నంత దిగుబడి రాలేదు. నలుగురు మగపిల్లలు. ఒక ఆడపిల్ల. ఇక్కడ పనులు లేవు. పనులు లేకపోతే మాకు బతుకులు లేవు. ఆరుగురం ఉన్నాం. ఏం తిని బతకాలి? ఇప్పటికే రూ. 2 లక్షలకు పైగా అప్పులు చేశాం. అందుకే పనులు వెతుక్కుంటూ ముంబయికి వలసపోతున్నాం. ఇప్పటికే నా తమ్ముడి కుటు-ంబం వెళ్లిపోయింది. ఇక్కడ అమ్మ ఉంటు-ంది. పిల్లలను ఆమె దగ్గర వదిలేశాం. ఇక్కడ పనులు లేవు. ఉన్న కొద్ది రోజుల్లోనూ వాళ్లు ఇచ్చేది తక్కువే, ముంబయిలో సిమెంటు- పనులు చేస్తాం. ఆయనకు రోజుకు రూ.600 ఇస్తారు. నాకు రూ.400 ఇస్తారు. ఇక్కడుంటే ఏమీ పని ఉండదు.ఇక్కడ ఉపాధి హామీ ద్వారా పనులు చేస్తే సరైన సమయానికి కూలి డబ్బులు రావడం లేదు. కుటు-ంబ పోషణ కరువై వలస వెళ్తున్నాం – కోసిగికి చెందిన వీరారెడ్డి