కృష్ణాజిల్లా నందిగామ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది… రెండవ డోస్ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రజలు బారులు తీరారు. దీంతో కేవలం వంద మంది మాత్రమే వ్యాక్సినేషన్ వేస్తామని సిబ్బంది అంటున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సిన్ కోసం తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రతి ఒక్కరు వరుస క్రమంలో రావాలని సూచించారు. ఆరోగ్య శాఖ ఇచ్చిన 100 స్లిప్పులు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉండమని చెప్పారు. అయితే ఆస్పత్రి వద్ద సిబ్బంది ఎటువంటి కరోనా జాగ్రత్తలు తీసుకోలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement