ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి వడగాలులతో ప్రజలు ఉక్కిరిబికిరవుతున్నారు. బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు , చిన్నారులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రోహిణికార్తె కావడంతో వడగాలులు అధికం అయ్యినట్లు తెలుస్తోంది. యాస్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఉక్కపోత పెరిగింది. కర్ఫ్యూ కావడంతో జనం ఇళ్లకే పరిమితమైయ్యారు. ఉక్కపోతతో విద్యుత్ వినియోగం కూడా బాగా పెరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement