Monday, November 18, 2024

Supreme Court: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది విచారణ.. ఈ రోజు మరోసారి విచారణకు రానుంది చంద్రబాబు పిటిషన్‌.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.. కాగా, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసిన తర్వాత.. వరుసగా ఆయనపై కేసులు నమోదు చేశారు.

అమరావతి ఇన్నిర్‌ రింగ్‌ కేసు, ఫైబర్‌ నెట్‌ కేసు.. ఇలా వరుసగా చంద్రబాబుపై కేసులు పెట్టారు. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో 50 రోజులకు పైగా ఉన్న చంద్రబాబుకు ముందుగా మధ్యంతర బెయిల్‌.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో బెయిల్‌ వచ్చింది.. మరోవైపు.. తనపై ఇతర కేసుల్లోనూ కోర్టులను ఆశ్రయించారు చంద్రబాబు.. పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై నవంబర్ 30న విచారణ జరిపిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం.. తదుపరి విచారణ ఈరోజుకు వాయిదా వేసింది. దీంతో ఇవాళ విచారణ జరుగనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement