Tuesday, November 19, 2024

AP | రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ..

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రేపు (సొమవారం) విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 12 ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా ధర్మాసనం రెండు వారాలకు (ఫిబ్రవరి 26కు) వాయిదా వేసింది. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది.

స్కిల్ కేసులో చంద్రబాబు గతేడాది సెప్టెంబరులో అరెస్టు కాగా.. ఏపీ హైకోర్టు నవంబరులో బెయిల్ మంజూరు చేసింది. తొలుత తాత్కాలిక బెయిల్ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement