టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదట మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇక, ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది.