Saturday, November 9, 2024

Health – ఫిట్‌నెస్ ఉంటేనే గుండె ప‌దిలం

స్ట్రోక్‌ని.. ఆపేద్దాం!
చిన్న వ‌య‌స్సులోనే గుండెపోటు మ‌ర‌ణాలు
మాన‌సిక ఒత్తిళ్లతోనే అంటున్న వైద్య నిపుణులు
శారీర‌క వ్యాయామం లేక‌పోవ‌డ‌మూ కార‌ణ‌మే
పోష‌కాలు ఉండే ఆహారం తీసుకోవాలి
స‌రైన నిద్ర కూడా ఉండాల్సిందే
ఈ చిట్కాలు పాటిస్తే ఆరోగ్యానికి మేలు
నేడు వ‌ర‌ల్డ్ హార్ట్ స్ట్రోక్ డే
అవ‌గాహ‌న కోసం పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, స్పెష‌ల్ డెస్క్‌:

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న చిన్న పిల్లలు కూడా అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి మరణిస్తున్నారు. అయితే.. అందిరికి గుండెపోటు గురించి అవగాహన కల్పించి, దాని ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రతీ ఏడాది అక్టోబర్ 29వ తేదీన వరల్డ్ స్ట్రోక్ డే జరుపుకుంటారు. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వ‌హిస్తుంటారు. అయితే.. గుండె పోటు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న‌పాటి చిట్కాలే అయినా.. హార్ట్ స్ట్రోక్ నుంచి బ‌య‌ట‌ప‌డే చాన్సెస్ ఎక్కువ‌గా ఉంటాయి. అందుక‌ని త‌ప్ప‌కుండా ఫాలో అయితే.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు.

- Advertisement -

శారీరక ఆరోగ్యం..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. వాకింగ్ చేయడం, స్విమ్మింగ్, సైకిలింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి.

మానసిక ఆరోగ్యం

ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా సంతోషంగా ఉంటే హార్ట్ స్ట్రోక్ నుంచి కాస్త విముక్తి ఉంటుంద‌ని ప‌లు అధ్య‌య‌నాల ద్వారా తెలుస్తోంది.

పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి

పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారం తీసుకోకుండా బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల గుండెపోటు వస్తుంది. వీటితో పాటు మద్యపానం, ధూమపానంతో కూడా హార్ట్ ఎటాక్ వస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుక‌ని పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమమ‌ని స్పెష‌లిస్టులు సూచిస్తున్నారు.

డిస్ట్ర‌బ్ లేని నిద్ర‌..

నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. ఒక్క రోజు నిద్ర లేకపోతే నీరసం, అలసటగా ఉండటంతో పాటు ఏ పని సక్రమంగా చేయలేరు. దీంతో పాటు గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర తప్పనిసరి. రోజుకి 8 గంటలు నిద్రపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాల నుంచి బయటప‌డొచ్చ‌ని వైద్య‌రంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement