అమరావతి, ఆంధ్రప్రభ:: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. టీచర్స్ గిల్డ్ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు బీ.చిట్టిబాబు అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్కే చిన్నప్ప, అధికార ప్రతినిధి ప్రభాకర రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మాణాలు చేసింది.
ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి వయో పరిమితి 62ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తూ మరణించే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలపై జీవో 113ను అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలనే పలు తీర్మాణాలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.