హైదరాబాద్ – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. అనంతరం అయన అక్కడ నుంచే నేరుగా ఎఐజి హాస్పటల్ కు వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి నేడు వెళ్లవలసి ఉంది.. సోదరుడి పరిస్థితి విషమించడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని
హైదరాబాద్ కు బయల్దేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినీ హీరో నారా రోహిత్… రామ్మూర్తినాయుడు కుమారుడు అనే విషయం అందరికీ తెలిసిందే.