అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారి ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గత ప్రభుత్వాలు వీటిని పూర్తిగా విస్మరించాయి. కొన్ని అమలుకు నోచుకోక, మరికొన్ని నామమాత్రంగా అమలు జరిగినా ఫలితాలను రాబట్టలేకపోయాయి. గతంలో పాఠశాలంటే కేవలం విద్యార్ధులు, ఉపాధ్యాయులే అనే భావన ఉండేది.
కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాలంటే విద్యార్ధుల సంపూర్ణ ఎదుగుదల అనే భావనకు బాసటగా నిలిచింది. ఈ క్రమంలోనే గడిచిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక విఫ్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. చదువుతో పాటు అనేక అంశాలలో నూతన సంస్కరణల శ్రీకారం చుట్టింది. ప్రతి యేటా విద్యార్ధుల సంపూర్ణ ఎదుగుదలకు నూతన సంస్కరణలతో చేపట్టిన కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావుల ప్రశంసలు అందుకుంటుంది. దేశంలోనె ఏపీ విద్యా వ్యవస్థ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది.
ఏపీలో ఉన్న 44,155 పాఠశాలల్లో సుమారు 34,95,514 మంది విద్యార్ధులు పాఠశాలల్లో జగనన్న గోరుముద్ధ పథకం కింద మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటున్నారు. రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రతి పాఠశాలలో పారిశుధ్య నిర్వహణకు రూ 6 వేల జీతం ఇస్తూ ఆయాలను నియమించారు. 300 మంది విద్యార్ధులకు ఒకరు, 600 మందికి ఇద్దరు, 900 మందికి ముగ్గురు చప్పున ఆయాలను 2021లో నియమించారు. పాఠశాలల్లో అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా నైట్వాచ్మెన్లను నియమించారు. నాడు నేడులో భాగంగా ఈ యేడాది 5,388 హైస్కూల్స్‌లో నైట్ వాచ్మెన్లను నియమించారు. వీరికి నెలకు రూ 6 వేల జీతం చెల్లిస్తున్నారు.
గోరుముద్ధకు సార్థకత
గతంలో పాఠశాల విద్యార్ధులలో పౌష్టికాహార లోపాన్ని సరిచేయడానికి విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉండేది. కాని గతంలో ఈ పథకం అమలు ఆశించిన మేరకు అమలుకాలేదు. ఏజెన్సీల నిర్ణయం మేరకు వంటలు తయారు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని సరికొత్త మెనూతో ‘జగనన్న గోరుముద్ధ’ గా ప్రక్షాళన చేశారు. ఒక ప్రత్యేక క్రమపద్ధతిలో ఉండే మెనూను రూపొందించి, పిల్ల్లల ఆరోగ్యానికి సంబంధించిన పోషకాహార విలువలతో పాటు రుచిగా వైవిధ్య భరితంగా ఉండేలా రూపొందించారు.
జగనన్న గోరుముద్ధ పేరును సార్థకత తీసుకువచ్చేలా ఆరు రోజులు ఆరు వైవిధ్య భరితమైన మెనూను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం పట్ల ప్రభుత్వానికి విద్యార్ధులపై ఎంతటి ప్రత్యేక శ్రద్ధ ఉందో తెలియజేస్తోంది. ఈ పథకం ప్రతి పాఠశాలలో సమర్ధవంతంగా అమలు చేయడానికి స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రాసెసింగ్ (ఎస్ఓపి) రూపొందించారు. దీని ప్రకారం కూరగాయలు, పప్పు దినుసులు ఎంత పరిమాణంలో వాడాలో అనే విషయాలపై ఖచ్చితమైన కొలతలు, వండే విధానాలతో సహా ఎస్ఓపిలో పొందుపరిచారు.
దీనిపై హెచ్ఎమ్, కుకింగ్ ఏజెన్సీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో వారానికి మూడు కోడిగుడ్లు ఇస్తుంటే ఇపుడు వారంలో ఐదు రోజుల పాటు ఇస్తున్నారు. పోషక విలువలు పెంచడానికి వారానికి మూడు సార్లు వేరుశనగ చిక్కి, ఉదయం రాగి జావ అందిస్తున్నారు. రాగిజావ తయారు చేయడానికి రాగి పిండి, బెల్లం ప్రభుత్వం నేరుగా పాఠశాలకు సరఫరా చేస్తోంది వంట చేయడానికి వంట సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.
పిల్ల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
గతంలో ప్రతి నెలా వారానికి ఒకసారి సమీపంలోని ప్రభుత్వ వైద్యశాల సిబ్బంధి నామమాత్రంగా పరీక్షలు నిర్వహించేవారు. విద్యార్ధులకు అందజేసిన హెల్త్ కార్డుల పంపిణీ చేసి వాటిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోలేదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వైద్యం అందించి జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బడి పిల్ల్లల్లో రక్త్తహీనత గుర్తించడంకోసం ప్రతి విద్యార్ధికి రక్త పరీక్షలు నిర్వహించారు. రక్తశాతం, రక్తహీనత స్థాయిని నమోదు చేశారు.
ఈ నమోదు వివరాలను నిత్యం పిల్ల్లల హాజురుతోపాటు వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. రక్తహీనతతో బాధపడే పిల్ల్లలను మైల్డ్, మిడిల్, సివియర్ మూడు దశలుగా గుర్తించి వారి వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. రక్తహీనత నివారణకు ఐరన్ పోలిక్ యాసిడ్ మందులను అందిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ప్రతివారం సందర్శిస్తూ పిల్ల్లల ఆరోగ్య వివరాలను తెలుసుకుని పర్యవేక్షిస్తుంటారు. పిల్ల్లల ఆరోగ్య భద్రతకోసం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడ్ని నియమించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు.
శానిటరీ నాప్కిన్స్ పంపిణీ
పూర్వం పాఠశాలలో వసతులు లేకపోవడంతో రుతుక్రమంలో విద్యార్ధినులు బడికి వచ్చేవారు కాదు. గ్రామీణ ప్రాంతంలో ఈ సమస్య అధికంగా ఉండేది. దీని వల్ల విద్యార్ధినుల హాజరు తగ్గిపోవడం, చదువులో వారు తోటి వారితో వెనుకంజలో ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యలను పరిష్కరించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ప్రతి ప్రాథమికోన్న్తత, ఉన్నత పాఠశాలలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ను సరఫరా చేస్తుంది. బాలికల సున్నితమైన సమస్యపై ప్రతేక శ్రద్ద తీసుకుని వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించింది.
ఫ్రెండ్లీ టాయ్‌లెట్స్ నిర్మాణం
గతంలో మరుగుదొడ్ల సౌఖర్యం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో డ్రాపౌట్ల శాతం ఎక్కువగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం నాడు నేడులో భాగంగా పిల్ల్లలకు ఫ్రెండ్లీ టాయ్‌లెట్స్ నిర్మాణం చేపట్టింది. అత్యంత ఆధునిక సౌకర్యాలతో, ఆకర్షణీయంగా నిర్మించింది. హ్యాండ్‌వాష్ బేషిన్స్, యూరోపియన్ కమ్మోడ్ వంటి సౌఖర్యాలతో టాయ్‌లెట్స్ నిర్మించారు. వీటి నిర్వహణ కొరకు ఆయాలను నియమించారు. వీటిని శుభ్రపరచడానికి అవసరమయ్యే కెమికల్స్, బ్రెష్, చీపుర్లు, ప్రభుత్వం నేరుగా అందజేస్తుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన (దివ్యాంగులకు) ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించారు. వీటికి ర్యాంపు నిర్మించి యూరోపియన్ కమ్మోడ్లతో నిర్మించారు.
సురక్షిత మంచినీటి సౌకర్యం
రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో గతంలో మంచినీటి సౌకర్యాలు లేక విద్యార్ధులు తమ ఇళ్ళ వద్ద్ద నుండి వాటర్ బాటిల్‌తో మంచినీరు తెచ్చుకునేవారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం విద్యార్ధులకు సురక్షితమైన మంచినీటిని అందించాలనే ఉద్దేశ ంతో ప్రతి పాఠశాలలో ఆర్వో వాటర్ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పిల్లల సంఖ్యను భట్టి ఫ్లాంటుల సామర్ధ్యాన్ని పెంచుతూ ఏర్పాటు చేశారు. పాఠశాల సమీపంలో ఉప్పు శాతం ఉన్నప్పటికీ ఈ ఫ్లాంట్ల ద్వారా శుద్ధిచేయబడి సురక్షితమైన నీటిని అందిస్తాయి.
ఆయాల నియామకం
గతంలో పాఠశాలను శుభ్రం చేయడానికి ఆయాల వ్యవస్థ లేదు. దీంతో పాఠశాలలో చదువుకునే విద్యార్ధినులు రోజుకు ఒకరు చప్పున పనులు విభజించుకుని పాఠశాలను, తరగతి గదులను ఊడ్చుకుని శుభ్రం చేసుకునే వారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం చదువుకోసం బడికి వచ్చే విద్యార్ధిని చీపురపట్టకూడదని నిర్ణయించి నెలకు రూ 6 వేల జీతం ఇస్తూ ఆయాలను నియమించింది. వీరు నిత్యం పాఠశాలను, తరగతి గదులను పరిశుభ్రం చేయడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్ధులకు సహాయకులుగా ఉంటారు. అమ్మ ఒడి పథకం నుండి వీరికి జీతాలను చెల్లిస్తున్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు చెక్
ప్రభుత్వ పాఠశాలలు పూర ్వం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. స్థానికంగా ఉండే ఆకతాయి మూకలు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతూ పాఠశాల ఆస్ధులను ధ్వంసం చేసేవారు. వాటికి చెక్ పెట్టడానికి, పాఠశాలలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు రూ 6 వేల జీతం చెల్లిస్తూ నైట్ వాచ్మెన్లను నియమించింది. వీరు సాయంత్రం పాఠశాల ముగిసే సమయం నుంచి ఉదయం పాఠశాల తెరిచె సమయం వరకు రక్షణగా ఉంటారు. పాఠశాలలో పనిచేసే ఆయా భర్తకు మొదటి ప్రాధాన్యత, కుకింగ్ ఏజెన్సీ భర్తకు రెండవ ప్రాధాన్యతనిస్తూ నై ట్ వాచ్మెన్ల నియామకం చెపట్టారు.