అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను సీఐడీ విచారణ జరుపుతోంది. ఇవ్వాల (మంగళవారం) ఉదయం నుంచి దాదాపు 6 గంటల పాటు లోకేష్‌ను సీఐడీ ప్రశ్నించింది. ఆయనను 30 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. తమ ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేదని, లోకేష్ ఏమాత్రం సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు మరోసారి విచారణకు రావాల్సిందిగా లోకేష్‌ను సీఐడీ ఆదేశించినట్టు సమాచారం.
అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ఆరున్నర గంటలు విచారణ జరిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఏ ప్రశ్న అడగలేదు. 50 ప్రశ్నల్లో ఒక్కటి కూడా కుటుంబ సభ్యులు ఎలా బాగుపడ్డారని అడగలేదని లోకేష్ అన్నారు. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని.. మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన జీవోఎం వివరాలు అడిగారని వెల్లడించారు. కక్ష సాధింపు తప్ప.. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్‌లు పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని.. మళ్లీ రేపు రావాలని 41ఏ నోటీసు ఇచ్చారని లోకేశ్ మీడియాకు చెప్పారు రేపు విచారణకు హాజరవుతానని లోకేష్ స్పష్టం చేశారు. అలైన్‌మెంట్‌కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారని తెలిపారు. హెరిటేజ్‌కు సంబంధించిన పదవులు, ప్రభుత్వంలో ఏయే పదవుల్లో ఉన్నారని అడిగారని లోకేష్ చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు.