బాపట్ల క్రైం (ప్రభన్యూస్): ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. బాపట్ల మండలం బేతపూడి గ్రామానికి చెందిన భోగిరెడ్డి వెంగల్ రెడ్డి(46) ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గవినివారిపాలెంలో అనుమానస్పదంగా చనిపోయాడు. బేతపూడికి చెందిన వెంగల్ రెడ్డి గవినివారిపాలెంలో పేకాట ఆడటానికి వెళ్లినట్లు గ్రామస్తులు అంటున్నారు. పేకాట ఆడుతున్న సమయంలో ఈపురూపాలెం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏమైందో ఏమో తెలియకుండానే వెంగల్ రెడ్డి చనిపోయాడు.
కాగా, మృతదేహాన్ని పోలీసులు చీరాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బేతపూడి ప్రజలు, కుటంబ సభ్యులు పెద్దఎత్తున చీరాలకు చెరుకొని పేకాట ఆడుతున్న వెంగల్ రెడ్డిని పోలీసులే తీవ్రంగా కొట్టరాని, దెబ్బలు తట్టుకోలేక చనిపోయాడని హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఈ విషయంపై చీరాల రూరల్ సీఐ రోశయ్యను వివరణ కోరగా వెంగల్ రెడ్డిని ఎవరూ కొట్టలేదని, కూర్చున్న వ్యక్తిని హోంగార్డు పిలవగా వస్తునని చెప్పాడన్నారు. దీంతో హోంగార్డు అక్కడి వచ్చేసారన్నారు. ఎంత సేపటికి అతను రాకపోవడంతో వెళ్లి చూడగా చనిపోయినట్టు గుర్తించామన్నారు.