ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన తమ్ముడు పవన్ కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “కల్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!” అని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్, తన భార్య సురేఖలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
బాబాయ్ కు అబ్బాయి..
జనసేనానికి రామ్ చరణ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చరణ్ ట్వీట్ చేశారు. “మీ బలం, అంకితభావం, అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు, చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. మీ నిస్వార్థ పనులు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావంతో దృష్టి సారించడం అద్భుతం. ఆంధ్రప్రదేశ్‌లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ, ఆశీర్వదిస్తూ మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.