( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి పెట్టుబడి అయినా తీసుకు రాగలిగారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువస్తే, చంద్రబాబు మాత్రం తన పుట్టిన రత్నం లోకేష్ ప్రమోషన్ కోసం దావత్ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. కోట్లు ఖర్చుపెట్టి పర్యటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమైననే, అసలు చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని ఇందుకు తూర్పు బైపాస్ నిలుపుదల చేయడమే ఉదాహరణగా చెప్పారు.
విజయవాడలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి నాగార్జునతో కలిసి మాట్లాడుతూ.. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దావోస్ పర్యటన వలన ఏ పెట్టుబడులు వచ్చాయనేది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర రెండులక్షల కోట్లు, తెలంగాణ యాభై వేల కోట్లు ఒప్పందం చేసుకుందని, కానీ ఆంధ్రప్రదేశ్ ఏటువంటి ఒప్పoదలు చేసుకోలేదన్నారు. చంద్రబాబు ఐదు సార్లు వెళ్లిన జగన్ ఒక్కసారి వెళ్ళిన దానితో సమానమని గతంలో జగన్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. పేదలను పీకుతున్నడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి నేతల ఆగడాలు ఇక సాగవన్నారు.