Thursday, January 23, 2025

AP పోలీస్ కు కొత్త‌ బాస్ హరీశ్ కుమార్ గుప్తా ..?

ఈనెల 31న ప్రస్తుత ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ నూతన బాస్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉండగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో హరీశ్ కుమార్ గుప్తా నూతన డీజీపీగా నియమితులయ్యే అవకాశముందని వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావే ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందున పదవీ విరమణ తర్వాత ఆయనను ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. హరీశ్ కుమార్ గుప్తా సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని రోజుల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారకా తిరుమలరావు డీజీపీగా నియమితులయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement