Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | హార్డ్ వ‌ర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వ‌ర్క్ కావాలి.. క‌లెక్ట‌ర్ల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం

AP | హార్డ్ వ‌ర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వ‌ర్క్ కావాలి.. క‌లెక్ట‌ర్ల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం

0

వెల‌గ‌పూడి – హార్డ్‌ వర్క్‌ ముఖ్యం కాదని.. స్మార్ట్ వర్క్‌ కావాలని క‌లెక్ట‌ర్ల‌ను కోరారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఓటే దేశాన్ని కాపాడుతుందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఆరు నెలలు పూర్తవుతున్న‌ సందర్భంగా ఇవాళ‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. 26జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్.

ఈ స‌ద‌స్సులో చంద్ర‌బాబు మాట్లాడుతూ… విధ్వంసక పాలన తర్వాత ఏపీలో పునర్నిర్మాణం జరుగుతోందని, ప్రభుత్వ విజన్, డైరెక్షన్ కలెక్టర్‌లకు తెలియజేయడం ఈసమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. నాశనం జరిగాక దాన్నితిరిగి నిర్మించినప్పడు, హర్డ్ వర్కు అవసరం అవుతుందన్నారు. క్రైసిస్‌లోనే అవకాశాలు ఉంటాయని.. దాన్ని తాను నమ్ముతానన్నారు.. ఎన్నికల కంటే ముందు తమకు ఓ అనుభవం ఉందని సీఎం అన్నారు. అయిదేళ్ళ తరువాత ఇండియాలో తప్పు చేసిన వారిని ఇంటికి పంపుతుందని, ఓటే ఈ దేశాన్ని కాపాడుతోందని అంటూ ప్రజాస్వామ్యంలో కరెప్షన్ జరగనప్పుడు నియంతలు పుడతారన్నారు.

అత్య‌ధిక పించ‌న్ లు ఇస్తున్న రాష్ట్రం ..
దేశంలో ఎక్కువ పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ఒకటో తారీఖున జీతాలు రాలేదని… ఇప్పడు ఒకటో తారీఖునే జీతాలు, పెన్షన్‌లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తాము ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడం లేదన్నారు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. సంక్రాంతి నాటికి ఆర్‌ అండ్‌ బీ రోడ్లపై గుంతలు ఉండకూడదని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు. మంత్రి నారా లోకేష్‌ కృషి వల్లే విశాఖకు గూగుల్‌ వచ్చిందని అన్నారు. గూగుల్‌తో ఎంవోయూ వల్ల వైజాగ్‌లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

క‌సి కోపం ఉన్నా..
గతంలో అనేక తప్పులు జరిగాయని, తనకు కోపం, కసి ఉందని.. అయితే తొందరపడకుండా ముందుకు వెళ్ళాలని అన్నారు. రాష్ట్రం బ్రాండ్ అయిదేళ్ళలో దెబ్బతిన్నదని నమ్మకం పోయిందని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చామని.. ఎవరయితే ల్యాండ్‌ను గ్రాబ్ చేసారో వారే దాన్ని ప్రూ చేసుకోవాలని చంద్రబాబు అన్నారు.

ఇంకా వైఎస్సార్‌సీపీ వాసనలు పనిచేస్తున్నాయి..
ఇంకా వైఎస్సార్‌సీపీ వాసనలు పనిచేస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసారని.. వాటికి యూసి ఇచ్చి డబ్బులు తెస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిని సెట్ చేశామని, కేంద్రం రూ. 15 వేల కోట్లు ఇచ్చిందని, బయటనుండి రూ. 16 వేల కోట్లు తెస్తున్నామని తెలిపారు. అమరావతికి రూ.31 వేల కోట్లు మొబలైజ్ చేశామని, ఫైనల్‌గా తోలిదశకు రూ.50 వేల కట్లు కావాలన్నారు. పెన్షన్‌ను 3 నెలలు పాటు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామని, దేశంలోనే ఎక్కు వ పెన్షన్‌లు ఇచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమేనని అన్నారు. రూ. 33 వేల కోట్ల పించన్లు ఇస్తున్నామని, దీపం 2 కింద 40 లక్షల మందికి సొమ్ములు చెల్లించామని సీఎం చంద్రబాబు తెలిపారు.

రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట..
అయిదేళ్లలో నాశనం అయిన రోడ్లు అన్ని పాత్ హోల్ ప్రీగా చేస్తున్నామని, రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్టపడాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి, డ్రగ్స్ బ్యాచ్‌లు ఉన్నట్టు వెలుగులోకి వస్తోందన్నారు. గంజాయి, డ్రగ్స్ మాఫియా కట్టడికి అంతా కలిసి పనిచేయాల్సిందేనని, జిల్లాల్లో ఈ మాఫియాను కూకటి వేళ్లను పెకిలించేయాలని కలెక్టర్లను ఆదేశిస్తున్నానని అన్నారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు, ఇప్పుడు పోర్టులు, సెజ్‌లను కూడా కబ్జా చేసేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అందుకే తీసుకువచ్చామన్నారు. 2047 విజన్ సాధన కోసమే రాష్ట్రంలో 20కి పైగా పాలసీలను తీసుకువచ్చామని, రాష్ట్రస్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ ప్లాన్ అమలు కావాలిన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అమరావతిని 31 వేల కోట్ల రూపాయల మేర నిధులతో నిర్మాణం చేపట్టబోతున్నామని, 2027కు పోలవరం పూర్తి చేసేందుకు గడువు నిర్దేశించుకుని ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు 16 వేల పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్సప్టం చేశారు.

Exit mobile version