Saturday, November 23, 2024

Harassment : లోన్​ రికవరీ ఏజెంట్ల వేధింపులు.. 18 ఏళ్ల స్టూడెంట్​ ఆత్మహత్య

లోన్​ రికవరీ ఏజెంట్ల వేధింపులతో ఆంధ్రప్రదేశ్​లో ఓ 18ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కృష్ణా జిల్లా నందిగామ రైతుపేటలో ఈ ఘటన జరిగింది. కాగా, విద్యార్థిని తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. కనకరావు తెలిపిన వివరాల ప్రకారం.. జాస్తి హరిత వర్షిణి అనే మృతురాలు తన కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆవేదనకు గురయ్యింది. తన తండ్రి బ్యాంకు నుంచి తీసుకున్న లోన్​ బకాయిలు చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురిచేశారు. దీంతో బాలిక వర్షిణి అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా, వర్షిణి తన బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని,  సూసైడ్ నోట్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం 3.5 లక్షల రుణం తీసుకున్నారని, రెండు రోజుల క్రితం ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు లోన్‌ రికవరీ ఏజెంట్లు వర్షిణి ఇంటికి వచ్చి కుటుంబాన్ని వేధించినట్లు ఆ సూసైడ్​ నోట్​లో రాసి ఉంది​. ఇక.. వర్షిణి తండ్రి జాస్తి ప్రభాకర్‌రావు ఢిల్లీలోని ఓ నిర్మాణ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, వర్షిణి, ఆమె తల్లి అరుణ, సోదరితో కలిసి నందిగామలో అద్దె ఇంట్లో నివస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement