Friday, September 20, 2024

AP: అమరావతిలో హ్యాపీనెస్ట్‌.. ఇక‌ ప్రాజెక్టుకు వ‌డివ‌డిగా అడుగులు..

రాజధాని పరిధిలో నివాస సముదాయాల ప్రాజెక్టు హ్యాపీనెస్ట్‌కు సవరించిన అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.930 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పనుల్ని ప్రారంభించేందుకు సీఆర్డీయే సిద్ధమైంది. సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే అదనపు వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో హ్యాపీనెస్ట్‌ పనులు చేపట్టకపోవడంతో రూ.216 కోట్లకుపైగా ప్రాజెక్టు వ్యయం పెరిగింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుగా టెండర్లను సీఆర్డీయే జ్యూడీషియల్‌ ప్రివ్యూకి పంపించింది. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం త్వరలో సీఆర్డీయే టెండర్లు పిలవనుంది.

12 టవర్లుగా జీ ప్లస్ 18 ప్రాతిపదికన నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 1200 ఫ్లాట్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుపై పడే రూ.216.61 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చేందుకు గతంలో సీఎం అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ఆమోదం తెలియజేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement