ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వెరైటీ విషెస్ తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం…ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై…. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని” అని కోరుకుంటూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అని తెలియజేశారు.