Tuesday, January 14, 2025

AP | రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు

మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారికి ప్రత్యేకమైన ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

పాడి పంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షించారు.

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే వేళ శాస్త్రోక్తంగా అన్ని విధాలా విశిష్టత ఉందని… అందుకే మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కమారు అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement